చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస .. కొండా వెంకట రంగారెడ్డి మనవడిగా సుపరిచితులు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక పదవులు.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రంగారెడ్డి పేరుమీదుగానే ప్రస్తుత రంగారెడ్డి జిల్లా...