చెరువును పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత

వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఇటీవ‌ల కురిసిన వర్షాల కారణంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం పెద్ద చెరువులో నీటి మట్టం పెరిగింది. దీంతో తూము పూర్తిగా ముసుకుపోయి చెరువుకు వెనుక భాగాన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చెరువు తూము ముసుకుపోవడం వల్ల పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతుల...