వృద్ధ దంపతుల హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు

రిమాండ్ కు నిందితుడి త‌ర‌లింపు వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండ‌లం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘర్షకుర్తి గ్రామంలో ఇటీవ‌ల వృద్ధ దంపతులపై జ‌రిగిన‌ హత్య, హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం సోమ‌వారం వెల్ల‌డించారు. గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య (76), ఆయన భార్య లక్ష్మి (70) దంపతులు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. వీరికి...