తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు
గతేడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష కాకతీయ,హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు....