వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: విద్యార్థుల సౌకర్యాలు, వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. సోమవారం పాత కొత్తగూడెం ప్రాంతంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటశాల, శానిటేషన్ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆహార నాణ్యత, శుభ్రత మెనూ వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర వహిస్తున్నందున ప్రతి రోజూ నాణ్యమైన ఆహారం అందేలా...