తిరోగమన’ వర్షాలు తెచ్చిన తిప్పలు..!
నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం పెద్దఎత్తున నీటమునిగిన పంటలు అతలాకుతలమైన అన్నదాత నల్లబెల్లిలో అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం కాకతీయ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారు జాము నుంచి వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలంలో అత్యల్పంగా 52. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దుగ్గొండిలో 88.6...