బీజేపీని అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యం

ప్ర‌తి ఇంటికీ.. పల్లెకూ కాషాయ జెండా తీసుకెళ్తాం.. కార్య‌క‌ర్య‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటా.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : త‌న ప్రయాణం ప్రజా సేవ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా త‌న‌ను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పునాది. భుజాలు కాయలుకాసేలా జెండాలు మోసి పార్టీని...