ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన గిరిజనులు

రెండు రోజుల్లో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేస్తామన్న ఎంపీడీవో కాకతీయ, పినపాక: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఎం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. సుందరయ్య నగర్ గ్రామస్తులు తమ గ్రామ రహదారిపై హామీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ సుందరయ్య నగర్ గ్రామంలో రహదారి నిర్మిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వంగాని, ప్రజాప్రతినిధులుగాని, అధికారులు గాని ఆ...