కార్గో, కొరియర్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్‌లో కొరియర్, కార్గో, పార్సెల్ సెంటర్లలో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణా గుర్తించేందుకు శిక్షణ పొందిన పోలీసు కుక్కలు ‘రాంబో’, ‘లియో’, ‘మైకి’ ‘టైసన్’ సహకారంతో కిసాన్ నగర్, బొమ్మకల్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, రాంనగర్, ముఖరాంపుర, జ్యోతి నగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డ తదితర ప్రధాన ప్రాంతాల్లోని అన్ని...