‘చీఫ్ జస్టిస్’పై దాడి హేయమైన చర్య

కాకతీయ, ఇనుగుర్తి : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడి హేయమైన చర్య అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మహంకాళి రామ్ సలీం లు అన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడైన న్యాయవాది చిత్రపటానికి నిప్పంటించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం...