దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీ
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ప్రచారం కాకతీయ, ఆదిలాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగలించి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు బోథ్ మండల కేంద్రంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా వారసంతలో వివిధ వర్గాల వారిని కలిసి ఎన్నికల కమిషన్, బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కును...