పిల్లల సామర్థ్యాలను పెంపొందించాలి
ఉపాధ్యాయులకు కలెక్టర్ జితేష్ పాటిల్ సూచనలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని పిల్లల సామర్థ్యాల పెంపుదలకు కృషి చేసేటట్లుగా ఉపాధ్యాయులను ఉత్తేజ పరచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యతని, దీనిని విస్మరిస్తే విద్యార్థుల ప్రగతి...