పీహెచ్ సీ తనిఖీ చేసిన డీఎంహెచ్ వో

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వైద్య సేవల తీరును సమగ్రంగా పరిశీలించారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా ఆరా తీసి, తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సిబ్బందితో...