ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
రైతులకు టోకెన్లను జారీ చేయాలి మిల్లులను అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో...