అబ్దుల్ కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

కాకతీయ, పినపాక : అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు ముందుకు తీసుకువెళ్లాలని పినపాక ఎంఈఓ నాగయ్య అన్నారు. బుధవారం పినపాక మండల పరిధిలోని ఈ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు విద్యార్థుల నడుమ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత కాలం మొత్తం విద్యార్థుల కోసమే కృషి చేశారని తెలిపారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం లాగా ఎదిగి దేశానికి సేవ చేయాలని కోరారు....