ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోన్న బీజేపీ
ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజల చైతన్యం అవసరం మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ, సంతకాల సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని అన్నారు. ఓటు దోపిడీ అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ ప్రజల ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల...