సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాకతీయ, పినపాక : సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ అనారోగ్య కారణాలతో పినపాక మండలానికి చెందిన పలువురు సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కులను అందజేశామని తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నిరుపేదల వైద్యం...