కొడుకు నిర్లక్ష్యంతో భూమిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ..
కొడుకు నిర్లక్ష్యంతో భూమిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ.. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని వారసులకు గుణపాఠంగా నిర్ణయం.. కాకతీయ, వరంగల్ బ్యూరో : ఎల్కతుర్తి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో, తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమి హస్తాంతరణ పత్రాలపై సంతకాలు చేసిన శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రు...