అందరికీ అందుబాటులో ఉండేవారికి అవకాశం ఇవ్వండి

కాకతీయ, బోథ్ : కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరి ఆమోదం పొందిన వ్యక్తికే డీసీసీ అధ్యక్షుడిగా పదవిని కేటాయిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల నియామక ప్రక్రియకు సంబంధించి బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ పట్టణంలో పార్టీ కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల...