గురుకులాల టైం టేబుల్ మార్చాలి
బోధనేతర సిబ్బందిన నియమించాలి: టీఎస్ యూటీఎఫ్ కాకతీయ, ఆదిలాబాద్: గురుకుల పాఠశాలల సమయసారణిలో మార్పు చేయాలని టీఎస్ యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కిష్టన్న, వి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా ఇచ్చోడ మండలంలోని గురుకులాల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. గురుకుల పాఠశాలల ప్రారంభ సమయం 7 గంటలకు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు టాయిలెట్, స్నానం చేయడానికి కూడా అవస్థలు పడుతున్నారని, నైట్ డ్యూటీలు,...