జుబ్లిహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
సెంట్రల్ జిల్లా పార్టీ అధ్యక్షుడి వైపే అధిష్టానం మొగ్గు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే బీజేపీ అభ్యర్థిని ఆపార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురి సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణలోకి తీసుకుంది. అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ...