బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి
కాకతీయ,లక్షెట్టిపేట : బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా పోరాటం చేయడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 ని విడుదల చేయగా,బీసీ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని లక్షెట్టిపేట పట్టణ,మండల బీసీ ప్రజాసంఘాల నాయకులు అన్నారు.రిజర్వేషన్లను పెంచాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 18 న తెలంగాణా రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు బీసీల పట్ల చిన్నచూపు...