ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు

కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలపారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ లతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177...