విద్యార్థులు చదువుల్లో రాణించాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో కాకతీయ,మహబూబాబాద్ ప్రతినిధి : గూడూరు మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఈదులపూసపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్స టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్ లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా...