భూ తగాదాలు ఠాణాలో పరిష్కరించబడవు

భూ తగాదాలు ఠాణాలో పరిష్కరించబడవు *ప్రజల శాంతిభద్రతలకై 24 గంటలు అందుబాటులో ఉంటా *గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ కాకతీయ,గీసుగొండ: భూ తగాదాలు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు పోలీసు స్టేషన్లలో పరిష్కరించబడవని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషనులో భూతగాదాలు ఆర్థిక లావాదేవీలు సమస్యలు పరిష్కరించబడవని,అటువంటి సివిల్ తగాదాలను ప్రజలు సంబంధిత న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల కోసం 24 గంటలు కృషి చేస్తానని,ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలు, నేరాలు, ఇతరులను కించపరచే లేదా రెచ్చగొట్టే సామాజిక...