నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా..

నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా.. పోలీసుల‌కు చిక్కిన కేటుగాళ్లు.. 8 మంది అరెస్ట్.. ప‌రారీలో మ‌రొక‌రు కాక‌తీయ‌, అశ్వాపురం : నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణాకు పాల్ప‌డుతున్న నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఇసుక లారీని ప‌ట్టుకున్నారు. డ్రైవర్ నాతి రాములు వే బిల్లును చూపించ‌గా అనుమానం వచ్చి ప్ర‌శ్నించారు. దీంతో నకిలీ వే బిల్ అని, ఓనర్ హైదరాబాద్ కు చెందిన కర్నాటి శివశంకర్...