హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రిమాండ్ కు తరలింపు కాకతీయ, నల్లబెల్లి: మండలంలోని కొండాపురం గ్రామంలో జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న రాత్రి కొండాపురం గ్రామానికి చెందిన మెరుగుర్తి రమేష్ తన తల్లి సమ్మక్కతో ఇంటి జాగా పంచి ఇవ్వమని వాదనకు దిగాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి తమ్ముడు మెరుగుర్తి సురేష్ “నేను నీకు ఇచ్చిన పదివేల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు.. పైగా అమ్మతో గొడవ ఎందుకు చేస్తున్నావు?” అని అన్నపై...