బీసీ బంద్‌లో కాంగ్రెస్–బీజేపీ పోటాపోటీ నినాదాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా శనివారం రాజకీయ పార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ రిజర్వేషన్ల సాధనకు పిలుపునిచ్చిన బంద్ రాజకీయ రంగు పులుముకుంది. బంద్ సందర్భంగా ర్యాలీలో కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎదురుపడడంతో ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోడీ డౌన్ డౌన్, బీసీల హక్కులను తొక్కే ప్రభుత్వాన్ని హటావ్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో బంద్ ప్రాంగణానికి చేరుకున్న...