పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా..

ఇంటి స్థలం, కంటి చికిత్స బాధ్యత స్వీకరించిన కెటిఆర్.. కాకతీయ, హైదరాబాద్‌ సిటీ బ్యూరో : తెలంగాణ జానపద సాహితీ ప్రియులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. శనివారం మొగులయ్య కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆరా తీశారు. మొగులయ్య తన కంటి చూపు మందగించి చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పగా, కేటీఆర్ వెంటనే స్పందించి ఆయనకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ...