పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
జిల్లా పశుసంవర్ధక సహాయ సంచాలకుడు బాలకృష్ణ కాకతీయ, దుగ్గొండి: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని వరంగల్ జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు బాలకృష్ణ సూచించారు. శనివారం దుగ్గొండి మండలం నాచినపల్లి, శివాజీనగర్, స్వామిరావుపల్లిలో గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని జేడీఏ సందర్శించారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు కొనసాగుతుందన్నారు. టీకా వేసిన పశువు చెవికి క్యూఆర్ కోడ్ పోగులు వేసి భారత్ పశుదాన్ యాప్లో వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రారంభ దశలో దూడలకు రెండునెలల వయసులోనే మొదటి టీకా...