విద్యార్థుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే
గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం కాకతీయ, కరీంనగర్ : గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించి పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యా కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి విద్యార్థులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ మాట్లాడుతూ.. గంగాధర...