వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణానికి పునాది
కాకతీయ, కరీంనగర్: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేములవాడ ఖండ పరిధిలోని విలాసాగర్ గ్రామంలో ఆదివారం పథసంచలన్ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల మైదానంలో జరిగిన సమావేశంలో ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళీధర్ జీ పాల్గొని మాట్లాడారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని 1925లో ప్రారంభమైన సంఘం, నేడు ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ, దేశభక్తి విలువలను వ్యాప్తి చేస్తోందని తెలిపారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి మూలాధారం అని, సమాజంలో సమరసత, కుటుంబ...