పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఫ్లాగ్ డే కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది నుండి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన 191 మంది అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ శ్రీనివాస్...