మాదకద్రవ్యాల ప్రభావాలపై అవగాహన

కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో మాదకద్రవ్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం అవుతున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని మంగళవారం కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ పరివర్తన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువతను, సమాజాన్ని నాశనం చేస్తున్నందున, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సమస్యను ఎదుర్కోవాల్సిన...