రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ డిజిటల్ క్యాంపెయిన్
కాకతీయ, జూలూరుపాడు: జిల్లాలోని ధ్వంసమైన ప్రధాన రహదారుల తీరుతెన్నులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం – ఖమ్మం మార్గంలోని జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద ధ్వంసమైన ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. రహదారులు ధ్వంసమైన తీరు కన్పించేలా సెల్ఫీలు దిగి ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ధ్వంసమై, గుంతలమయమై ప్రమాదభరితంగా ఉన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని...