అంగన్వాడీల బలోపేతానికి ‘పాలన పథకం’ కీలకం

జిల్లా కలెక్టర్ రాజార్షి షా కాకతీయ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్‌లో మంగళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “పాలన పథకం”పై ఐసీడీఎస్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలన పథకం లక్ష్యాలు, అమలు విధానం, డేటా సేకరణ పద్ధతులు, మొబైల్ అప్లికేషన్ వినియోగం తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి మాణికప్ప ప్రధాన శిక్షణదారులుగా పాల్గొన్నారు. అనంతరం వారు రిక్షా కాలనీ, సంజయ్ నగర్, మహాలక్ష్మి వాడ...