కాంగ్రెస్ ప్రభుత్వం దండారి చెక్కులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
కాకతీయ బోథ్: బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు దండారి ఉత్సవానికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులు ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎంపీపీ తుల. శ్రీనివాస్ అన్నారు. వజ్జర్ మహాదూగూడ, జైతుగూడ, టివిటి గ్రామాల ఆదివాసుల ఆహ్వానం మేరకు దండారి ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ పాల్గొని ఆదివాసీలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయానికి రైతు భరోసా, దండారి చెక్కులు ఇచ్చేవారని అప్పుడు ఆదివాసీలు సంతోషంగా ఉండేవారన్నారు. కార్యక్రమంలో...