నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడిని తాకిన సూర్య కిరణాలు
కాకతీయ, గీసుగొండ : మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. స్వామివారికి అభిషేకం నిర్వహించే సమయంలో గర్భగుడిలోని నాగేంద్రుడి పుట్ట పైన, మూల విరాట్ పై సూర్యకిరణాలు ప్రసరించడంతో గర్భగుడి పసిడివర్ణంగా మారింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామి వారిని వైదిక మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక అభిషేకము పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా...