దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీ
ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ నలుగురు మావోయిస్టుల లొంగుబాటు కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీసులు చేపట్టిన ‘పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి’ అనే అవగాహన కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పునరావాస సదుపాయాల ప్రభావం వల్ల మరో నలుగురు అజ్ఞాత మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు మడవి కోసి అలియాస్ పైకి (20), మడవి ఎడుమె (21), ముచ్చాకి...