అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు.. కాకతీయ, హైదరాబాద్ సిటీ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అంబర్‌పేట కార్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ...