కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం

రామప్పను సందర్శించిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నతాధికారులు కాకతీయ, ములుగు ప్రతినిధి: వరంగల్ కాకతీయుల కళా సంపదను వీక్షంచడానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నతాధికారులు బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా రామప్పను సందర్శించారు. ముందుగా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టతను గైడ్ వారికి వివరించారు. అనంతరం చైర్మన్లు ఇద్దరు మాట్లాడుతూ చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు...