దళారులను నమ్మి మోసపోవద్దు

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం ఆయన బెజ్జంకి మండలం తోటపల్లి, ముత్తన్నపేట, కల్లేపల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యానికి చెల్లింపులు నిర్ణీత గడువులోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ...