ముగిసిన ఫైలేరియా నిర్ధారణ సర్వే
కాకతీయ, లక్షెట్టిపేట : మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈనెల 13 నుండి చేస్తున్న ఫైలేరియా వ్యాధి నిర్ధారణ టాస్ వన్ సర్వే బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలందరికీ 2021 నుండి 2023 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు బోధకాల నివారణ మాత్రలను అందజేశామన్నారు. నాలుగో విడతలో బోధకాలు ఎలిమినేషన్ లో భాగంగా వ్యాధి వ్యాప్తి ఏవిధంగా వుందో తెలుసుకోవడానికి టాస్ వన్ సర్వే నిర్వహించామని తెలిపారు. వెంకట్రావుపేట, చందారం, మోదెల,...