ఘనంగా కొమురం భీమ్ జయంతి
కాకతీయ, బయ్యారం : తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ బయ్యారం మండలకమిటీ (జాక్) ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్ లో కొమురం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్లను 50సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డి దారిన వచ్చిన వారికి దోచిపెట్టడం వల్ల , నేడు ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అందుకు నిరసనగా ‘మా ఊళ్ళో మారాజ్యం’...