సోయా పంట కొనుగోలు చేయాలి
రోడ్డెక్కిన అన్నదాతలు కాకతీయ, ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బోథ్ మండలకేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. సోయా పంటను 20 రోజుల నుండి మార్కెట్ యార్డ్ లో ఆరబెడుతున్నామని, యార్డు లో సోయా పంట నిల్వలు పేరుకుపోయాయని వాపోయారు. కనీసం మార్కెట్ యార్డ్ కు పంట తీసుకువద్దమన్నా కూడా స్థలం కూడా లేదని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందమన్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రాత్రింబవళ్ళు మార్కెట్ యార్డులోనే వుండవలసి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు....