క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌ ఓపెన్ హౌస్

క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌ ఓపెన్ హౌస్ పోలీసు భ‌ద్ర‌తా, ఆయుధాల నిర్వ‌హ‌ణ‌పై విద్యార్థులకు అవ‌గాహ‌న‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. నగరంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పనితీరును ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఉపయోగించే ఆధునిక...