మామునూరులో ఘోర రోడ్డు ప్రమాదం

స్కూటీని ఢీకొట్టిన కారు భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలావరంగల్ మండలం మామునూర్ గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి బోల్తా ప‌డింది. ఈ ఘటనలో ద్విచ‌క్ర‌వాహ‌నం పై ప్ర‌యాణిస్తున్నరాజు తీవ్రంగా గాయపడ‌గా, ఆయ‌న‌ భార్య హారిక (36) అక్కడిక్కడే మృతిచెందింది. అంబూలెన్స్ లో క్ష‌త‌గాత్రుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించ‌గా ఆయ‌న పరిస్థితి విషమంగా ఉంద‌ని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...