అమ్మ సలహాతోనే ఆ సర్జరీ చేయించుకున్నా: జాన్వీ కపూర్
కాకతీయ, సినిమా: 2025 అక్టోబర్ 24: సినిమా ప్రపంచం అంటే మాంత్రిక అద్దం లాంటిది. ప్రేక్షకులు చూసేది అందం, కానీ ఆ అందం వెనుక ఉన్న త్యాగం, బాధ, మరియు మార్పులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు బ్యూటీ వరల్డ్‌లో ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఎందరో సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ ముఖం లేదా శరీరంలో లోపాలను సరిచేసుకుంటున్నారు. కొందరికి ఇది కంఫిడెన్స్ బూస్టర్‌గా, మరికొందరికి ఇమేజ్ మేకోవర్‌గా మారుతుంది. అయితే ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీల...