విద్యార్థి శ్రీ వర్షిత మృతికి ప్రభుత్వమే కారణం
గురుకులాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతోంది విద్యార్థి మృతదేహంతో హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ కాకతీయ, హుజురాబాద్: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న శ్రీ వర్షిత ఆత్మహత్య ఘటనపై హుజరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని మృతదేహంతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత మృతదేహానికి...