న్యాయస్థానం ఏర్పాటుకు బిల్డింగ్ పరిశీలన
తీరనున్న న్యాయసేవల ఇబ్బందులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో న్యాయస్థానం ఏర్పాటు కోసం స్థానిక న్యాయవాదులు సమర్పించిన వినతిపత్రాన్ని హైకోర్టు పరిశీలించి, తగిన ఏర్పాట్లను చూడవలసిందిగా జిల్లా న్యాయస్థానానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ కే. గోపీనాథ్ కేశవపట్నంలోని నాలుగు భవనాలను పరిశీలించమని ఆదేశించారు. ఈ మేరకు శనివారం కేశవపట్నంలో బిల్డింగ్‌లను పరిశీలించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ హుజురాబాద్ వారు భవనాన్ని ఫైనల్...